న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ను మరోసారి విచారించింది. సుమారు వారం రోజుల క్రితం సిట్ సునందా పుష్కర్ కుమారుడు శివ్ మీనన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావడానికి థరూర్ తొలుత దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తరువాత అతన్ని వసంత్ విహార్‌లోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (ఏఏటిఎస్) కార్యాలయానికి తీసికెళ్లారు. థరూర్ ఏఏటిఎస్ కార్యాలయానికి ఉదయం 11.20 గంటలకు చేరుకోగా, 11.30 గంటలకు అతన్ని విచారించడం మొదలుపెట్టినట్టు ఒక పోలీసు అధికారి చెప్పారు. సిట్ టీమ్ గత నెల 19న థరూర్‌ను ఇదే కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే.
డిసిపి ప్రేమ్‌నాథ్, అదనపు డిసిసి పి.ఎస్ కుష్వాహా, మరో ముగ్గురు అధికారులతో కూడిన సిట్ టీమ్ గురువారం థరూర్‌ను ఐపిఎల్ కొచ్చి ఫ్రాంచైజీ సహా అనేక అంశాలపై ప్రశ్నలు అడిగింది. థరూర్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి నారాయణ్ సింగ్ కూడా ఆయన వెంట సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. సిట్ టీమ్ నారాయణ్ సింగ్‌ను కూడా ఇంటరాగేట్ చేసింది. కొన్ని అంశాలపై థరూర్ నుంచి వివరణ రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను మరోసారి విచారిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్ బస్సీ బుధవారం విలేఖరులకు చెప్పిన విషయం తెలిసిందే

No comments:
Post a Comment