రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
సంగారెడ్డి : మెదక్ మార్కెట్ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు. నూతనంగా గోదాముల నిర్మాణానికి, దుకాణాసముదాయాలకు నిధులు మంజూరు కావడంతో వాటి నిర్మాణం కోసం మార్కెట్ కమిటీ ఆవరణ మొత్తం కాలినడకన పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అన్ని హంగులతో మార్కెట్ కమిటీని అభివృద్ది పరుస్తామని తెలిపారు. ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు వద్ద వరి ధాన్యం కోనుగోలు చేసిన అనంతరం వెనువెంటనే రైతుకు డబ్బులు అందేవిధంగా ఆర్‌డిఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాసా రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి ఆర్‌డిఓ మంచునాగేష్, మున్సిపల్ కమిషనర్ వేంకటేశం గుప్త తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment