జిల్లాలో మొత్తం 880 మంది స్థానిక ప్రజాప్రతినిదులు ఓటర్లుగా ఉన్నారు
-జిల్లా రెవెన్యూ అధికారి యస్ దయానంద్
సంగారెడ్డి : జిల్లాలో మొత్తం 880 మంది స్థానిక ప్రజాప్రతినిదులు ఓటర్లుగా ఉన్నారని వీరందరి ఫోటోలు ఆధార్ నెంబరును సేకరించి ఆప్‌లోడ్ చేసి అనుసంధానం చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి యస్ దయానంద్ పేర్కోన్నారు. బుదవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధలు ఓటర్ల జాబితాను మే 18న ప్రదర్శించడం జరిగిందని, దీనిపై ఏవైన అభ్యంతరాలుంటే తెలుపాలని విన్నవించినప్పటికి, ఏలాంటి అభ్యంతరాలు రాలేవని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇందుకు సంబంధించి తుది జాబితాలను ఈ నెల 6న ప్రదర్శించటం జరుగుతుందన్నారు. సంగారెడ్డి డివిజన్‌లో 346,మెదక్ డివిజన్‌లో 324,సిద్దిపేట డివిజన్‌లో 210 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారన్నారు. ప్రజాప్రతినిదుల నియోజక వర్గానానిక సంబంధించి జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదిస్తూ రెవెన్యూ డివిజనల్ అధికారులు నివేధికలు సమర్పించారని అట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి సమర్పించామని ఆయన వివరించారు. సంగారెడ్డి డివిజన్ పరిధిలో సంగారెడ్డిలోని ఎన్.జి.ఓ భవన్ మెదక్ డివిజన్‌లో మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, సిద్దిపేట, డివిజన్‌లో ప్రభుత్వ డీగ్రీ కళాశాల సిద్దిపేట, పోలీంగు కేంద్రాలుగా ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని తెలిపారు.ఈ పోలీంగ్ కేంద్రాలపై కూడా ఏవైన అభ్యంతరాలుంటే తెలుపాలని ఆయన వివిధ పార్టీల ప్రతినిధులకు కోరగా, ఏలాంటి అభ్యంతరాలు లేవని ఆయా పార్టీల ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్తు సి.ఈ.ఓ మధు, మున్సిపల్, కమీషనర్లు, వివిధ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment