రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న యువత
కరీంనగర్ : రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని మండల గ్రామాల్లోని మహిళలు, యువకులు పెద్దఎత్తున సంబరాలు జరుపుతున్నారు. ఈ నెల 2 నుంచి ప్రతిరోజు యువకులు క్రికెట్, వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్నారు. అలాగే మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ 60 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం హర్షదాయకమని అన్నారు. మన తెలంగాణ, మన నీరు, మన బొగ్గు స్వచ్ఛందంగా వాడుకుంటున్నామని, ఇప్పుడు ఎంతో సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల అభివృద్ధి జరుగుతున్నది. దీనితో బంగారు తెలంగాణకు బాటలు ఏర్పడుతున్నట్లు కనబడుతోందని అన్నారు. రైతుల కోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికలు తీయడం, వాటర్‌గ్రిడ్ పథకం ఏర్పాటు చేయడం వంటివి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కన్నా అభివృద్ధిలో ముందుందని అన్నారు. నిడ్మానూరు, ఎల్లంపల్లి, ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అన్నారు. 20 సంవత్సరాల క్రిందటే రాష్ట్రం వచ్చి ఉంటే నేడు మరో సింగపూర్‌ను తలపించేదని అన్నారు.

No comments:
Post a Comment