రైతులకు అవగాహన సదస్సు
కరీంనగర్ : మన తెలంగాణ- మన వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సును శనివారం మేడిపల్లి మండలంలో వ్యవసాయ అధికారి నరేష్ ఆధ్వర్యంలో జరిగింది. నరేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు సదస్సుల ద్వారా విత్తనాల పంపిణీ, వ్యవసాయ విధివిధానాలపై అవగాహనలు ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. పంటసాగులో రైతులు తక్కువపెట్టుబడిని పెట్టి అధిక పంటను పొందేలా అధికారులు తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 50 శాతం సబ్సిడీ విత్తనాలపై వ్యవసాయ పనిముట్లపై అందుతుందని అన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నరేష్ అన్నారు.

No comments:
Post a Comment