పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధు
కరీంనగర్ : పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పి.మధు అన్నారు. కాళేశ్వరంలోని ఆలయానికి వచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిలో నిర్మిస్తున్న పుష్కరిణి ఘాట్లు, తాత్కాలిక షెడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాణ్యతతో కూడిన పనులను వేగవంతం చేయాలన్నారు. పనులలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే పుష్కరాలు గుర్తుండేలా సీఎం చర్యలు చేపట్టారని అన్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ఇతర రాష్ట్రాల నుండి ఈ పుష్కరాలకు వస్తారని అన్నారు. గోదావరి నది ఈ ప్రాంతంలో రెండు నదులుగా ప్రవహించడం వల్ల కాళేశ్వర ఆలయానికి మంచి విశిష్టత ఉందన్నారు.

No comments:
Post a Comment