నేతాజీ సుభాష్ చంద్రబోస్.. దేశంలో కోట్ల మందికి ఆరాధ్యుడు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన నేతాజీ ఏమయ్యారన్నది ఎవరికీ తెలియదు. ఆయన మరణం పెద్ద మిస్టరీ. నేతాజీకి సంబంధించిన సమాచారమేదీ ప్రభుత్వాలు బయటికి వెల్లడించకపోవడంతో సామాన్యులతో పాటు కుటుంబ సభ్యులు కూడా దశాబ్దాలుగా అయోమయంలో ఉన్నారు. ఐతే నేతాజీకి సంబంధించిన కొన్ని రహస్య పైళ్లు, డాక్యుమెంట్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది. వాటిని నేతాజీ కుటుంబ సభ్యులకు అందచేస్తున్నట్లు ప్రకటించింది.
కోల్ కొత లోని మ్యూజియంలో కూడా సోమవారం నుంచి వీటిని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మొత్తం 64 ఫైళ్లలో నేతాజీ అదృశ్యానికి సంబందించిన సమాచారం ఉందని భావిస్తున్నారు. 12744 పేజీలున్న ఈ దస్త్రాలకు చాలా ప్రాధాన్యముందని అనుకుంటున్నారు. వీటన్నింటినీ డిజిటలైజ్ చేయడం విశేషం. 1937 నుంచి 47 మధ్య నేతాజీ జీవితంలో ఏమేం జరిగిందన్న సమాచారం ఈ ఫైళ్లలో ఉంది.ఇందులోని సమాచారం బయటకు తెలిస్తే నేతాజీ ఎలా చనిపోయారు? ఎప్పుడు చనిపోయారు అన్న మిస్టరీ వెల్లడవుతుందని కొందరు భావిస్తుండగా.. కీలకమైన ఫైళ్లన్నీ ప్రభుత్వం తన వద్దే ఉంచుకుని.. అప్రాధాన్యమైన ఫైళ్లు, డాక్యుమెంట్లు మాత్రమే ప్రభుత్వం బయటపెడుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐతే నేతాజీకి సంబంధించిన ఏ సమచారమైనా ఆసక్తి రేపేదే కాబట్టి ఆ ఫైళ్లలో, డాక్యుమెంట్లలో ఏముందో చూడాలన్న కుతూహలం జనాల్లో ఉంది.
No comments:
Post a Comment