దిలీప్ కుమార్ కు అస్వస్థత
సెంట్రల్ డెస్క్, ఏప్రిల్ 16 :
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం ఇబ్బదికరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయి శివారు బంద్రాలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. కొన్నేళ్లుగా దిలీప్‌కుమార్ వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.ఇప్పుడు న్యూమోనియా కుడా వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, 72 గంటల పాటు తమ పర్యవేక్షణలో ఉంచనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దిలీప్ కుమార్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న ఆయన అభిమానులు లీలావతి ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. 93 ఏళ్ల దిలీప్ కుమార్ ఆరు దశాబ్దాలనుంచి హిందీ చిత్రసీమలో ఆగ్రతారగా వున్నారు. మధుమతి, దేవదాస్, ముఘల్-ఏ-అజాం, గంగా జమున, రాం ఐర్ శ్యాం, కర్మ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. భగ్న ప్రేమికుడిగా అయన తనదంటూ ముద్ర వేసారు. దిలీప్ కుమార్ కు 2015 లో పద్మవిభూషన్ పురస్కారం లభించింది. అంతకుముందు 1991 లో పద్మభూషన్, 1994 లో దాదాసహేబ్ పాల్కే అవార్డు లు తీసుకున్నారు.

No comments:
Post a Comment