కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశాలు లేనట్లే
హైదరాబాద్, ఏప్రిల్ 16 :
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల పతనావస్థ కొనసాగుతోంది. ఓవైపు ఇంజనీరింగ్ కాలేజీలపై ప్రభుత్వ కఠిన వైఖరి, మరోవైపు ఊపిరాడకుండా చేస్తున్న సమస్యల నేపథ్యంలో రేసు నుంచి తప్పుకొనేందుకు యాజమన్యాలు నిర్ణయించుకుంటున్నాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే జేఎనటీయూ కాలేజీల జాబితా నుంచి 58 ఇంజనీరింగ్ కాలేజీలు 'ఔట్ అయ్యాయి. 2016-17 విద్యా సంవత్సరానికిగాను కాలేజీ నడిపించేందుకు తప్పనిసరిగా కావాల్సిన వర్సిటీ అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) కోసం ఆ కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో నిబంధనల ప్రకారం వర్సిటీ అఫిలియేషన లేని ఆ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలు నిర్వహించేందుకు అవకాశం లేదు. గుర్తింపునకు దరఖాస్తు కోసం జేఎనటీయూ ఈ యేడాది ఫిబ్రవరి 10న నోటిఫికేషన జారీ చేసింది.
మార్చి 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా 266 కాలేజీలకుగాను 208కాలేజీలు మాత్రమే అఫిలియేషన కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. ఈ కాలేజీల జాబితాను జేఎనటీయూ గురువారం బయటపెట్టింది. సదరు కాలేజీలకు నోటీసులు జారీచేసి, చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంజనీరింగ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ కోర్సులు నడుస్తున్నాయి. అన్ని కోర్సుల్లో కలిపి దాదాపు 7వేల మంది విద్యార్థుల వరకు ఉంటారని అంచనా. దీంతో ఈ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రతి యేడాది నూతన విద్యా సంవత్సరంతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న కోర్సులకు కూడా కాలేజీ యాజమాన్యం వర్సిటీ అనుంబంధ గుర్తింపు తీసుకోవాలి. కానీ ఈ కాలేజీల యాజమాన్యాలు మాత్రం మొదటి సంవత్సర ప్రవేశాలతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న మిగతా మూడు సంవత్సరాలకు కూడా అఫిలియేషనకు దరఖాస్తు చేయలేదు దీంతో ఆ కాలేజీల్లోని విద్యార్థులకు వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉండదు. వారికి డిగ్రీలు కూడా ఇవ్వరు. మరోవైపు కాలేజీలు చేసిన తప్పులకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా జేఎనటీయూ చర్యలు చేపట్టనుంది. ఈ కాలేజీలు అఫిలియేషన తీసుకునేందుకు నిరాకరిస్తే, వారిపై చర్యలు తీసుకుని, విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేర్పించాలని నిర్ణయించింది.
భారీగా తగ్గనున్న సీట్లు :
రెండేళ్లుగా తగ్గుముఖం పడుతున్న ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య ఈ యేడాది కూడా భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2015-16 విద్యా సంవత్సరానకి సంబంధించి తెలంగాణలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,26,468 సీట్లు అందుబాటులో ఉండగా 51621 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం 2016-17 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్‌కు 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోకపోవడంతో ఈ కాలేజీల్లో ఉన్న 20వేల సీట్లు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు జేఎనటీయూ అనుబంధ కాలేజీల్లో నిర్వహిస్తున్న తనిఖీలు మరో వారంలో పూర్తికానున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలపై కొరడా ఝుళిపించనున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని కాలేజీలు మూతపడి సీట్ల సంఖ్యలో కొతపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

No comments:
Post a Comment