తెలుగు సినిమాల్లో కాంబినేషన్ వర్కవుట్ అయినట్లు మరెక్కడా కాదు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పట్టుకొచ్చే కాంబినేషన్స్ మరింత
ఆసక్తికరంగా ఉంటూ అనౌన్స్‌మెంట్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. తాజాగా ఈ కోవలో పూరీ జగన్నాథ్ ఓ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు
హీరోలు తమ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీస్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా 50, 100, 150, 200వ సినిమాలు ఆ సంఖ్యకు చేరిన టైమ్‌లో
వాటిని గ్రాండ్‌గా వుండేలా స్కెచ్ వేసుకుంటారు. బాలక ష? 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకరి?', చిరంజీవి 150వ మూవీ 'కత్తిలాంటోడు' చేస్తున్నారు.
తాజాగా విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకి చేరువవుతున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో రానుంది 'బాబు బంగారం' మూవీ 73వది. 74వ సినిమాని తుమ్మల కిషోర్ డైరెక్టర్ చేయనున్నట్లు టాక్. ఇందులో హీరోయిన్
కాజల్ అగర్వాల్. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇకపోతే 75వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ చేయవచ్చనే టాక్ ఫిల్మ్ సర్కిల్‌లో
నడుస్తోంది. ఇటీవల పూరీ చెప్పిన స్టోరీ లైన్ బాగుండడంతో దాన్ని డెవలప్ చేయమని వెంకీ చెప్పినట్టు సమాచారం. నార్మల్‌గా క్రైమ్ తరహా చిత్రాలను పూరీ చేస్తాడని,
బహుశా ఇది 'ఘర్షణ 2' కావచ్చనే ప్రచారం సాగుతోంది. సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జునను మాత్రమే డైరెక్ట్ చేసిన పూరీ, ఇప్పుడు వెంకీని డైరెక్ట్
చేయనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి పూరీ, వెంకీ రెండు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.



No comments:
Post a Comment