మంచి జోరు మీద దూసుకుపోతున్నాడు బన్ని..ఎప్పుడు కూల్ గా ఎంటర్ టైన్ చేసే అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ మాస్ మాసాలా తో ఎంటర్
చేస్తున్నాడు..బోయపాటి డైరెక్షన్ లో సరైనోడిగా చెలరేగిపోతున్నాడు. క్లాస్ సెంటర్స్ లో సో సో గానే అలరించిన ఈ మూవి బి సి సెంటర్స్ లో మాత్రం
దుమ్మురేపుతుంది.
బన్నీ కోసం బోయపాటి క్లాస్ రూట్ లోకి వస్తాడేమో అనుకున్నా అలాంటి వింతలేవీ జరగలేదు. బన్నీనే తన రూట్ లోకి తెచ్చుకున్నాడుబన్నీతో ఐరెన్ బాల్ పట్టించి దుమ్ము లేపాడు బోయపాటి.ఇది బోయపాటి స్టయిల్ అనిపించాడు.ఇక అల్లు అర్జున్ ఈ మూవి లో తన దైన స్టయిల్ లో రెచ్చి పోయాడు ఇప్పుడు కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నాడు.
స్టైలీష్ స్టార్ బన్నీ, మాస్ డైరక్టర్ బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' సినిమా, బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. కేవలం 3 రోజుల్లో దాదాపు 30 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఈ మూవీ.ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ అంటూ పరుగుపెడుతుంది.
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' సినిమాకి మొదట మిశ్రమ స్పందన వచ్చింది. కానీ
తర్వాత ఈ సినిమా అనుకున్న అంచనాలు చేరుకొని బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు. మొత్తానికి బన్ని మాత్రం
'సరైనోడు' చిత్రంతో నాలుగోసారి 50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు.
సరైనోడు చిత్రం విడుదలైనపుడు ఈ చిత్రంపై మిశ్రమ స్పందన రావడం చిత్రంలో విపరీతమైన వైలెన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద
చతికిలపడిపోతుందని అంతా భావించారు. కానీ మెల్లి మెల్లిగా ఈ చిత్రంపై అభిప్రాయం మరోలా మారిపోయింది.
సరైనోడు రిజల్ట్ అందరు అనుకున్న దాని కన్న భిన్నంగా వస్తుండడంతో నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు తెగ ఆనందంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతానికి
ఈ చిత్రానికి భారీ సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడంతో ఒక్క నైజాంలోనే పదిరోజుల్లో రూ.13.97 కోట్లు కలెక్షన్స్ దుమ్ము లేపింది. .. మొదటి వారంలోనే
యాబై కోట్ల మార్క్ ను అందుకొని సంచలనం స ష్టించాడు..
అంతే కాదు బన్ని కెరీర్ లో ఇదో పెద్ద హిట్ చిత్రమే అని చెప్పవొచ్చట. ఎప్పుడు స్టైలిష్ గా కనిపించే బన్నీ ఈ చిత్రంలో ఊర మాస్ లాగా కనిపించి
యాక్షన్స్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో పండించగాలనని నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సరైనోడుతో బన్నీ కలెక్ట్ చేసిన రెండు వారాల
కలెక్షన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి.ఇప్పుడు మనోడు 60 కోట్ల కలెక్షన్స్ అంటూ హంగామా చేస్తున్నాడు.ఇక రాబోయే రోజుల్లో ఏ సినిమా చూపిస్తాడో
చూడాలి.



No comments:
Post a Comment