ఆరుగాలం శ్రమించి పండించిన నిమ్మ పంటకు మార్కెట్ లో మద్దతు ధర లభిస్తున్నా రైతన్నకు మాత్రం ఆ ధర అందడం లేద. పెట్టిన పెట్టుబడికి సమానంగా కోత, కూలీ, రవాణా ఒక పక్క భారంగా మారగా, మరోవైపు, అడ్డాల వద్ద కమీషన్ ఏజెంట్లు నిమ్మ రైతును పీల్చి పిప్పి చేస్తున్నారు. దీంతో నల్లగొండ జిల్లాలో నిమ్మరైతు నిలువు దోపిడికి గురవతున్నాడు.
జిల్లాలో నిమ్మ రైతాంగాన్ని దళారులు నిలువునా ముంచుతున్నారు. కమీషన్ల పేరుతో కోతలు పెడుతై రైతుల కష్టానికి ఫలితం లేకండా చేస్తున్నారు. ఒక
పక్క కోత, కూలి, రవాణా, పెట్టుబడులతో బేజారవుతుండగా మార్కెట్ కు పంటను తీసుకేళ్లే దళారుల చేతుల్లో పిప్పి అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎకరాకు కనీసం 15 వేల రూపాయలు కుడా మిగలడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో నిమ్మకు అతిపెద్ద మార్కెట్ గా వున్న నకిరేకల్, జిల్లా కేంద్రమయిన నల్లగొండ ప్రాంతాల్లో 30 నుంచి 40 మంది దళారుల చేతుల్లోనే నిమ్మ ధర నిర?యించే పరిస్థితి వుంది. వారు చెప్పిందే
ధర..వారు కొన్నదే రేటు అన్న విధంగా మారడంతో గత్యంతరం లేని స్థితిలో నిమ్మ రైతు వారికే నిమ్మకాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా
దళారులు ప్రతియేటా నిమ్మ రైతునుంచి దాదాపు 30 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం చేస్తూ నిమ్మ రైతులతో మాత్రం దివాళా తీయిస్తున్నారు.
జిల్లాలో ఉద్యావన సాగులో బత్తాయి తర్వాత అధికంగా సాగు చేస్తున్న పంగ నిమ్మ కావడంతో విశేషం. నిమ్మ తోటలకు జిల్లాలోని పలు ప్రాంతాలు
అనుకూలంగా వుండడంతో దిగుబడి సైతం ప్రతియేటా పెరుగుతున్న నేపధ్యం లో రైతులు నిమ్మ పంటను నమ్ముకున్నారు. అయితే, జిల్లాలో నిమ్మ
రైతులు పండించిన పంటలు విక్రయించుకునేందుకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితిల్లో దళారులకు అమ్ముకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల హెక్టార్లలో నిమ్మ సాగవుతుండగా హెక్టారుకు 20 టన్నులవరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
జిల్లాలో నిమ్మ మార్కెట్ లేకపోవడంతో హైదరాబాద్ లో విక్రయించాల్సి రావడంతో నిమ్మ వ్యాపారాన్ని అడ్డాగా చేసుకుని కొంతమంది దళారులు కమీషన్ల పేరుతో నిమ్మ రైతును పీల్చి పిప్పి చేస్తున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో పదినుంచి పదిహేనుమంది వరకు నిమ్మకాయలను కొనుగోలు చేసే
కమీషన్ ఏజెంట్లు వున్నారు. జిల్లాలో నిమ్మకు అతిపెద్ద మార్కెట్ గా వున్న నకిరేకల్ లో ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఏజెంట్లు వున్నారు.
హైదరాబాద్ మార్కెట్ లో బస్తా నిమ్మకాయలకు సుమారు 1600 రూపాయల ధర లభిస్తుండగా స్థానిక ఏజెంట్లు మాత్రం రైతులనుంచి 1100 రూపాయలకే
బస్తా కొనుగోలు చేస్తూ గ్రేడింగ్, కాయ సైజు లాంటి సాకులతో దివాళా తీయిస్తున్నారు. వేసవి సీజన్ లో సుమారు లక్షా 25 వేలనుంచి లక్షా యాభై వేలవరకు పంట వస్తుండగా ఆగస్తు, సెప్టెంబర్ మాసాల్లో మాత్రం కేవలం 50 వేలనుంచి 75 వేల రూపాయలు మాత్రమే లభిస్తుందని రైతులు అవేదన వ్యక్తం
చేస్తున్నారు. కోత, కూలీ, రవాణా, పెట్టుబడుల లెక్కలు తీసినతరువాత రైతుకు ఎకరాకు 15 వేల రూపాయలు కుడా మిగలకుండా పోతోంది.
ఈ పరిస్థితి నుంచి నిమ్మ రైతులను ఆదుకోవాలన్నా, దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా నిమ్మకాయలు అమ్ముకోవాలన్నా, జిల్లాలో నిమ్మ
మార్కెట్ ఏర్పాటు చేయడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం అని రైతులు అంటున్నారు.

No comments:
Post a Comment