కొత్త ఫీచర్ తో ఇన్ స్ట్రాగ్రాం
సెంట్రల్ డెస్క్, జూన్ 6,
ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ అప్లికేషన్ ఇన్‌స్టాగ్రాం కొత్త అప్‌డేట్‌తో త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వెర్షన్‌లో ఇన్‌స్టాగ్రాం మరింత ఆకర్షణీయమైన లుక్‌తో యూజర్లకు దర్శనమివ్వనుంది.ఇన్‌స్టాగ్రాం యాప్‌లో ఇప్పటి వరకు యూజర్లు అప్‌లోడ్ చేసిన తేదీ, సమయాన్ని బట్టి ఫొటోలు, వీడియోలు ఓ వరుస క్రమంలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ వరుస క్రమాన్ని ఇన్‌స్టాగ్రాం ప్రతినిధులు మార్చి యూజర్లకు అందివ్వనున్నారు. ఇకపై కొత్త ఇన్‌స్టాగ్రాం వెర్షన్‌లో ఫొటోలు, వీడియోలు యూజర్ల అభిరుచులకు అనుగుణంగా కనిపించనున్నాయి. యూజర్ వయస్సు, అతను సెర్చ్ చేసే కంటెంట్ తదితర వివరాలకు అనుగుణంగా ఆయా ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రాం తెరపై దర్శనమివ్వనున్నాయి. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్‌తో కూడిన అప్‌డేట్‌ను ఇన్‌స్టాగ్రాం విడుదల చేయనుందని సమాచారం. అయితే ఫైనల్ అప్‌డేట్ విడుదలైతే గానీ కొత్త వెర్షన్ ఎలా ఉంటుందనే విషయం ఇంకా చెప్పలేమని పలువురు టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment