మూడేళ్ల నుంచి నేను సింగిలే...
టెన్నిస్ లో సింగిల్స్, మిక్స్ డ్ డబుల్స్ అనే టోర్నమెంట్స్ ఉంటాయి. సినిమా తారలకూ ఆ రూల్ వర్తిస్తుంది. ఇక్కడా సింగిల్ గా ఉండేవాళ్లూ, మిక్స్ డ్ డబుల్స్ అంటే జంటగా ఉండేవాళ్లూ ఉన్నారు. సింగిల్ గా కంటే ...పెళ్లి చేసుకోకుండా జంటగా ఉండేందుకు ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. అయితే, కొందరు పైకి చెప్పరు. కొందరికి పబ్లిసిటీ ఇష్టం. నిన్నగాక మొన్న హీరోయిన్ సమంత తన మనసులో మాటను బయటకు చెప్పి అందరిని ఆశ్చర్యింపజేసింది.సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'నేను సింగిల్ గా ఉన్నానని ఎవరన్నారు?' అని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసి, అందరినీ స్టన్ చేసేసింది. లేటెస్ట్ గా హీరోయిన్ కాజల్ కూడా అలాంటి స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చింది. అయితే సమంత చెప్పిందానికి ఇది రివర్స్ లో ఉంది. 'మూడేళ్ల నుంచీ సింగిల్ గా ఉంటున్నా'నని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది కాజల్ అగర్వాల్. ఇప్పుడు ఆమె మాటల్ని రకరకాలుగా తీసుకుంటున్నారు . ఇప్పుడు సింగిల్ గా ఉందంటే ఇంతక ముందు తప్పకుండా ఎవరితోనో ఉంటోందనే అర్థమా అని కొందరు అంటున్నారు.కాజల్ మాటల్ని మరికొందరు ఇంకోవిధంగా సాగదీస్తున్నారు. ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నానని చెప్పిన కాజల్ మూడేళ్ల క్రితం ఎఫైర్ లో ఉన్నదీ చెప్పలేదు. మళ్లీ నచ్చిన వ్యక్తి దొరికితే డీప్ లవ్ లో పడతానని కూడా చెప్పింది. బట్... సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను పెళ్లి చేసుకోనని, మరో ఫీల్డ్ కు చెందిన వాళ్లయితే అనుబంధం పెరుగుతుందని చెప్పింది. లైఫ్ లో తానంత రొమాంటిక్ కాదని, నిద్రలేచిన దగ్గర్నుంచి ఐ లవ్ యూ చెప్పడం తనవల్ల కాదని అంది. సింగిల్ గా ఉంటున్నానని కాజల్ చెప్పినా....ఎట్ ప్రెజెంట్ దుబాయ్ బిజినెస్ మేన్ తో లవ్ లో ఉందని బాలీవుడ్ లో అనుకుంటున్నారు.


No comments:
Post a Comment