Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 30 July 2016

వచ్చే నెలలో ఎంసెట్‌ 3

 వచ్చే నెలలో ఎంసెట్‌ 3
హైద్రాబాద్‌, జూలై 30,
ఎంసెట్‌ లీకేజీ నిర్ధారణ కావడంతో వచ్చే నెలలో ఎంసెట్‌ 3 నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లీకేజీ నిజమని ముంబై కేంద్రంగా ఆపరేషన్‌ సాగిందని దాదాపు 150 మందికి పైగ విద్యార్థులు లాభపడ్డారని సీఐడీ తన నివేదికలో తేల్చిచెప్పింది. ఒకవేళ రద్దు చేయకపోతే న్యాయపరమైన చిక్కుల వస్తాయని సూచించారు. దీంతో రద్దు నిర్ణయానికే మొగ్గు చూపారు. ఇప్పడు విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తోంది. అంతకు మందు సవిూక్షంచిన సీఎం ప్రశ్నపత్రాలు లీకయిన సందర్భాల్లో దేశంలోని పలు యూనివర్శిటీలు వ్యవహరించిన తీరు అందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల హైకోర్టులు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయశాఖ కార్యదర్శి తదితర న్యాయ శాఖ అధికారులతో చర్చించారు.పోలీసు విచారణ రిపోర్టును అనుసరించి లీకుద్వారా ర్యాంకులు పొందిన విద్యార్దులను అనర్హులుగా ప్రకటించి వారికి అవకాశం ఇవ్వకుండా అడ్మిషన్లను చేపడితే ఎట్లా ఉంటుందని సీఎం ఆరా తీశారు. వరుస ఎంట్రెన్స్‌ లతో వైద్యవిద్యార్థులు
ఇప్పటికే అలసిపోయి విసిగిపోయి ఉన్న విషయాన్ని సమావేశం చర్చించింది. వేలాది మందిని మానసిక క్షోభకు గురి చేసిన ఈ దురదృష్టకర సంఘటన పట్ల సీఎం సహా అందరూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పరీక్షాపత్రాల లీకేజీల పట్ల తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమున్నదని సమావేశం అభిప్రాయ పడింది. నేరస్తులకు కఠిన చట్టాలను వర్తింపచేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, పేపరు లీకుకు పాల్పడిన వారితో పాటు ప్రోత్సహించిన వారిని వాటిని వినియోగించుకున్న వారిని కఠినంగా శిక్షించాలని సమావేశంలో పాల్గొన్న వైస్‌ ఛాన్సలర్లతో పాటు పలువురు అధికారులు సీఎం కు సూచించినట్టు తెలిసింది.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 80 సార్లు వివిధ పరీక్షాపత్రాలు లీకు అయ్యాయని, కాగా దాదాపు అన్ని పరీక్షలను రద్దు చేసి తిరిగి
నిర్వహించారని అధికారులు సిఎంకు వివరించారు. సుప్రీం కోర్టు కూడా పరీక్ష తిరిగి నిర్వహించడమే సరియైనదిగా తీర్పునిచ్చిందని తెలిపారు. అత్యున్నత న్యాయస్తానం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని సమావేశం నిర్ణయించినట్టు సమాచారం.ఈ నేపధ్యంలో పలువురు ఉన్నతాధికారులు విద్యా కోవిదులు మంత్రుల సలహా సూచనల మేరకు ఎం సెట్‌ 2 ను రద్దు చేయడమే సరియైన నిర్ణయంగా సిఎం భావించినట్టు సమాచారం.కాగా ఇప్పటికే పరీక్షలు రాసిన విద్యార్ధులకు ఊరటనిచ్చే విధంగా తిరిగి పరీక్షఫీజును చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత రిజిష్ట్రేషన్‌ ప్రకారమే తిరిగి పరీక్ష రాసేందుకు వెసులు బాటును కల్పించేదుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. పరీక్షరోజున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్దులకు ఉచిత ప్రయాణ వసతి కల్సించేందుకు సిఎం సంబంధిత
అధికారులతో చర్చించినట్టు సమాచారం.వేలాది మంది విద్యార్ధులు వారి తల్లి దండ్రులను క్షోభకు గురిచేసే విధంగా వ్యవహరించి మెడికల్‌ ఎంట్రెన్స్‌ ప్రశ్నపత్రం లీక్‌ కు కారకులు ఎంతటివారయినా వారిని అత్యంత కఠినంగా శిక్షాల్సిందేనని సమావేశం చేసిన సూచనలను సీఎం పరిగణలోకి తీసుకన్నట్టు సమాచారం.భవిష్యత్తులో ఇటువంటి నేరానికి పాల్పడాలంటే భయపడే విధంగా ఆ శిక్షలు అమలు చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks