మార్చి తర్వాత ఎస్ బీహెచ్ ఉండదు
ముంబై, జూలై 30,
దశాబ్దాల పాటు సేవలందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వచ్చే మార్చి నుంచి పూర్తిగా అంతర్థానం కానుంది. ఎస్ బీ ఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. ఎస్ బి హెచ్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, మరో మూడు బ్యాంకులు స్టేట్ బ్యాంకులో విలీనమైపోతాయని చెప్పారు. అయితే ఖాతాదారుల ప్రయోజనాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, ఎవరికీ నష్టం రానీయబోమని, ఇప్పటికే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన వారికి అదే రీతిన వడ్డీరేట్లు కంటిన్యూ అయ్యేట్లు చూస్తామని తెలిపారు. ఓ పక్క విలీనాన్ని వ్యతిరేకిస్తూ 80 వేల మంది ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సిబ్బంది సమ్మె చేస్తుండగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మార్పు తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. ఎస్‌బీఐ వెల్త్ మేనేజ్‌మెంట్ అందిస్తున్న ఎస్‌బీఐ ఎక్స్‌క్లూసిఫ్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో అరుందతీ భట్టాచార్య అన్నారు.

No comments:
Post a Comment