పిఎస్‌ఎల్‌వి-సి 23 దిగ్విజయం
నింగికెగసిన విదేశీ ఉపగ్రహాలు
26 వరుస విజయాలతో రికార్డు
అగ్ర దేశాల సరసన భారత్: నరేంద్ర మోదీ
నింగికెగసిన విదేశీ ఉపగ్రహాలు
26 వరుస విజయాలతో రికార్డు
అగ్ర దేశాల సరసన భారత్: నరేంద్ర మోదీ
నెల్లూరు/ సూళ్లూరుపేట, జూన్ 30: అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రోదసీ పరిశోధనలో భారత్ మరో మైలురాయిని అధిగమించి విదేశీ వాణిజ్యరంగ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 23 మరోసారి విజయబావుటా ఎగురవేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ఉదయం 9-52కు పిఎస్‌ఎల్‌వి-సి 23 రాకెట్‌ను శాస్తవ్రేత్తలు ప్రయోగించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విదేశీ వాణిజ్య, నావిగేషన్ సేవలకు సంబంధించిన స్పాట్-7, ఎఐశాట్, ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2, వెలాక్స్ అనే ఐదు విదేశీ ఉపగ్రహాలతోపాటు (ఇస్రో శాస్తవ్రేత్తలు రూపొందించిన 60 కిలోల ఎఐఎన్‌ఎస్ అనే పేలోడ్‌ను) ఒకేసారి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో శాస్తవ్రేత్తలు మరోసారి తమ సత్తా చాటారు. దీంతో భారత్ సాంకేతిక రంగంలో అగ్ర దేశాలకు దీటుగా నిలవడమేకాకుండా ఇస్రో శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీస్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 8:52కు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 49:00 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. తరువాత సోమవారం ఉదయం 9:52కు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వరుసగా 26వ విజయాన్ని నమోదు చేస్తూ పిఎస్‌ఎల్‌వి-సి 23 ఫ్రాన్స్ దేశానికి చెందిన 714 కిలోల బరువున్న స్పాట్-7 ఉపగ్రహంతో పాటు కెనడాకు చెందిన 15 కిలోల బరువున్న ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్- 7.2, జర్మనీకి చెందిన 14 కిలోల బరువున్న ఎఐశాట్, సింగపూర్‌కు చెందిన 6.5 కిలోల బరువున్న వెలాక్స్‌తో పాటు (ఇస్రో శాస్తవ్రేత్తలు రూపొందించిన ఎఐఎన్‌ఎస్ పేలోడ్‌ను) 19:58కు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిఎస్‌ఎల్‌వి-సి 23 వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విదేశీ ఉపగ్రహాలు 655 కిమీ సూర్యనువర్తమాన కక్ష్యలోకి చేర్చారు. ఈ ప్రయోగం విజయంతో భారతదేశంలో ప్రతి పౌరుడికీ గౌరవం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలను అభినందించారు. ఈ ప్రయోగ విజయం ద్వారా ఏడాదికి 47 కోట్ల రూపాయల ఆదాయం రావడమే కాకుండా వాణిజ్య రంగంలో ఇస్రో మరో మైలురాయిని దాటింది. వీటిలో స్పాట్-7 60 వ్యాసార్థంతో 1.5 మీటర్ల పరిధిలోవన్న ఏ చిన్న వస్తువునైనా ఛాయాచిత్రాలు తీసి ఆయా దేశ రాడార్ కేంద్రాలకు చేరవేస్తోంది. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి స్పాట్-1 నుంచి నేటి స్పాట్-7 వరకు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించి సేవలను వినియోగించుకొంటున్నారు. జర్మనీకి చెందిన ఉపగ్రహాలు ఎఐశాట్ ఉపగ్రహం ద్వారా సముద్రంలో ఉండే నౌకల గమనస్థితులను, వాటి ఇబ్బందులను ఆ దేశాలకు చేరవేస్తుంది. కెనడా దేశానికి చెందిన ఎన్‌ఎల్‌ఎస్ ఉపగ్రహాలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా పోయే చిన్న ఉపగ్రహాలను 500 వరకూ వ్యవస్థలను వాటి పనితీరును ఛాయాచిత్రాలు ద్వారా తెలుసుకోగలుగుతుంది. సింగపూర్‌కు చెందిన వెలాక్స్-1 ఉపగ్రహం సముద్రంలో అందే సిగ్నల్‌ను స్టోరేజ్ చేసుకొని ఆయా దేశ సిగ్నల్‌ను అవసరమైనప్పుడు ఆయా దేశాలకు చేరవేస్తోంది. నావిగేషన్ సేవలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్యరంగ ప్రయోగానికి ప్రయోగం ఇస్రో శ్రీకారం చుట్టింది. ఈ ఉపగ్రహ సేవలు పదేళ్లపాటు అందనుంది. ఇప్పటికే స్పాట్-6 ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సి 21 ద్వారా 2012లో ప్రయోగించి దాని సేవలు అందుకుంటున్నారు. ప్రయోగ సమయంలో 230 టన్నుల బరువు, 44.4 మీటర్ల ఎత్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్ తన నాలుగు దశలను సునాయాసంగా పూర్తి చేసుకుని భూమికి 655 కిమీ దూరంలోని సూర్యనువర్తమాన కక్ష్యలోకి ఉపగ్రహాలను శాస్తవ్రేత్తలు విజయవంతంగా చేర్చారు. మిషన్ కంట్రోలర్ సెంటర్ నుండి రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న శాస్తవ్రేత్తలు రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన తరువాత ఒకదాని తరువాత ఒకటి నిర్ధేశించిన సమయానికే తన నాలుగు దశలను పూర్తిచేసుకొని రాకెట్ నుంచి ఉపగ్రహాలు విడిపోయి కక్ష్యలోకి దూసుకెళ్లాయి. అక్కడే రాకెట్ గమనాన్ని సూపర్ కంప్యూటర్ల ద్వారా గమనిస్తున్న రేంజ్ ఆపరేషన్ సిబ్బంది రాకెట్ నాలుగో దశ పూర్తి చేసినట్టు నిర్ధారించడంతో మిషన్ కంట్రోలర్ సెంటర్‌లో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్ నరసింహన్, సిఎం చంద్రబాబు, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తమ హర్షధ్వానాలతో విదేశీ వాణిజ్యరంగ ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా చేర్చామని అక్కడున్న శాస్తవ్రేత్తలను ఆలింగనం చేసుకొని పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించారు. ఇస్రో నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు ఇప్పటివరకు షార్ నుంచి మొత్తం 27 చేపట్టగా మొదటి ప్రయోగం వినా మిగిలిన 26 ప్రయోగాలు వరుసగా విజయపరంపర మోగించాయి. (చిత్రం)నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న పిఎస్‌ఎల్‌వి సి23 ; రాకెట్ పయనాన్ని ఉత్కంఠగా తిలకిస్తున్న షార్ శాస్తవ్రేత్తలు


No comments:
Post a Comment