లీటర్‌పై రూ.1.69, డీజిల్‌పై 50 పైసలు పెంపు
న్యూఢిల్లీ, జూన్ 30: సాయుధ సంఘర్షణలతో అట్టుడుకుతున్న ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం అంతర్జాతీయ చమురు, కరెన్సీ మార్కెట్లపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. దీంతో దేశంలో పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.1.69 పైసలు, డీజిల్ ధర 50 పైసలు చొప్పున పెంచారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని దేశీయ చమురు సంస్థలు స్పష్టం చేశాయి. స్థానిక అమ్మకం పన్ను లేదా వ్యాట్‌ను మినహాయించి ఈ ధరలను పెంచినందున దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం రూ.71.56 పైసలుగా ఉన్న లీటర్ పెట్రోల్ ధర సోమవారం అర్ధరాత్రి నుంచి రూ.2.02 పైసలు పెరిగి రూ.73.58 పైసలకు చేరుకుంటుంది. అలాగే డీజిల్ ధర లీటర్‌కు 56 పైసలు పెరిగి రూ.57.84 పైసలకు చేరుకుంటుంది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వలన అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గత రెండు వారాల్లో గణనీయంగా పెరిగాయని, ప్రత్యేకించి గ్యాసోలిన్ (పెట్రోల్) ధర బ్యారెల్‌కు 4 అమెరికా డాలర్ల కంటే అధికంగా పెరిగిందని, అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా ప్రస్తుతం ఇంధనం ధరల పెంపుదలకు ప్రధాన కారణమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) స్పష్టం చేసింది.

No comments:
Post a Comment