- 30/06/2014
TAGS:
బాగ్దాద్, జూన్ 29: సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న తిక్రిత్ పట్టణాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ఇరాక్ సైన్యం సన్నద్ధమైంది. నగరం చుట్టూ మోహరించి ఏ క్షణమైనా దాడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మరోపక్క మిలిటెంట్లు పాగా వేసిన భవనాలపై శనివారం సాయంత్రం నుంచి వైమానిక దాడులు చేస్తోంది. మిలిటెంట్లు సైన్యంపై ఎదురుదాడికి దిగడంతో ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిక్రిత్‌లో నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, వైమానిక దాడుల భయం వెన్నాడుతుండటంతో చాలామంది ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో తిక్రిత్ నగరం చాలామటుకు నిర్మానుష్యంగా మారిపోయింది. ఇరాక్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన తిక్రిత్‌ను సున్నీ మిలిటెంట్లు నెల రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. యావత్ ఇరాక్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు దూకుడుగా వస్తున్న సున్నీ మిలిటెంట్లను అక్కడినుంచి తరిమికొట్టేందుకు యుద్ధట్యాంకులు, హెలికాప్టర్ వాహక నౌకలతో తిక్రిత్‌ను చుట్టుముట్టింది. ఇందుకు సంబంధించి భిన్నమైన వార్తలు వెలువడుతున్నా, సైన్యం ఎంతమేరకు తిక్రిత్‌లోకి చొచ్చుకుపోతుందన్నది స్పష్టంగా తెలియడం లేదు. తిక్రిత్ శివారుల్లో సైన్యం మోహరించిందని, ఏ క్షణమైనా మిలిటెంట్లపై ప్రత్యక్ష దాడికి దిగే అవకాశముందని ప్రొవిన్షియల్ గవర్నర్ వెల్లడించారు. ప్రస్తుతం తిక్రిత్‌ను తిరిగి చేజిక్కించుకునేందుకు సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే అటు ఇరాక్ సైన్యానికి, అధ్యక్షుడు మాలికికి ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు. శనివారం సాయంత్రం తిక్రిత్ సరిహద్దులకు చేరిన సైన్యం మిలిటెంట్లు దాగివున్న యూనివర్శిటీ క్యాంపస్‌పై వైమానిక దాడులు జరిపినట్లు ఇరాక్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఖాసిమ్ అల్ వౌసావి తెలిపారు.
తిక్రిత్‌కు ఉత్తరం వైపునుంచి శివారు వద్దకు సైన్యం చేరుకోగా, మరికొన్ని దళాలు గతంలో అమెరికాకు సేవలందించిన వైమానిక స్థావరం వద్ద రక్షణగా నిలిచినట్లు సలావుద్దీన్ ఆపరేషనల్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ అబు రఖీఫ్ ధ్రువీకరించారు. కాగా, శనివారం సాయంత్రం వరకు తిక్రిత్ నగరం మిలిటెంట్ల అధీనంలోనే ఉందని స్థానికులు వెల్లడించారు. సున్నీల ప్రాబల్యం కలిగిన తిక్రిత్‌లో సుమారు రెండు లక్షలమంది వీధుల్లో పహారా కాస్తున్నారు. యునివర్శిటీ క్యాంపస్‌లో ఉన్న మిలిటెంట్లకు, సైన్యం మధ్య దాడులు జరుగుతున్నాయని స్థానికులు ధ్రువీకరించారు. సైనిక హెలికాప్టర్ల దాడుల అనంతరం టిగ్రిస్ నదీతీరాన ఉన్న అధ్యక్ష భవన కాంప్లెక్స్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిపారు.

చిత్రం.. తిక్రిత్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామం వద్ద మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు మాటువేసి ఉన్న ఇరాక్ సైన్యం

No comments:
Post a Comment