కిషన్‌గంజ్ (బీహార్), జూన్ 30: మాల్దా నుంచి న్యూ జల్పాయ్‌గురికి వెళుతున్న ఒక ప్యాసింజర్ రైల్లో ఎనిమిది శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు కిషన్‌గంజ్ రైల్వే పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి అలోక్ ప్రసాద్ సింగ్ సోమవారం తెలిపారు. రైలు కిషన్‌గంజ్ స్టేషన్‌లో ఆగినప్పుడు పోలీసులు, ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి సిబ్బంది నిర్వహించిన తనిఖీలో బాంబులు బయటపడ్డాయని, ఒక జనరల్ బోగీ నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బాంబులు ఉన్నట్లు నిర్ధారించిన వెంటనే బాంబు స్క్వాడ్‌ను రప్పించి వాటిని నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఇంటెలిజెన్స్ సిబ్బంది విచారణ చేపట్టారని తెలిపారు.
చొరబాటు యత్నం భగ్నం
జమ్మూ, జూన్ 30: జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు తీవ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళం తిప్పికొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి ఆరుగురు తీవ్రవాదులను భారత్‌లోకి చొప్పించేందుకు పాకిస్తాన్ సైనికులు తర్కుదీ సెక్టార్‌లో భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని, భారత జవాన్లు దీటుగా ప్రతిస్పందించి ఎదురుదాడికి దిగడంతో తీవ్రవాదులు తోకముడిచారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు. సుశిక్షితులైన తీవ్రవాదులను జమ్మూ-కాశ్మీర్‌లోకి చొప్పించేందుకు పాకిస్తాన్ సైనిక దళం పదేపదే ప్రయత్నిస్తోందని భారత జవాన్లతో పాటు నిఘా సంస్థలు నిందిస్తున్నాయి.

బ్యాగులో యువతి శవం!
పుణె, జూన్ 30: పుణె శివారు ప్రాంతంలోని ఒక చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, ట్రావెలింగ్ బ్యాగు నుంచి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతి శవం బయటపడింది. ఈ యువతిని గొంతు నులిమి హత్య చేసినట్లు, శరీరంపై అక్కడక్కడా కొన్ని గాయాలున్నాయి. చెక్‌పోస్టు వద్ద ఎవరో వదిలి వెళ్లిన బ్యాగును తనిఖీ చేయగా, శవం బయటపడింది. యువతి నల్లని జీన్ ప్యాంటు, తెల్లటి టాపు ధరించి వుందని, మృతికి కారణాలను, యువతికి సంబంధించిన ఆనవాళ్లను ఇంకా గుర్తించాల్సి వుందని పుణె శివారులోని ఎరవాడ పోలీసులు తెలిపారు. మృతురాలిని గుర్తించేందుకు నగరంలోని మిగతా పోలీసు స్టేషన్లకు సమాచారం అందించామని తెలిపారు.

No comments:
Post a Comment