నెల్లూరు/సూళ్లూరుపేట, జూన్ 30: పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచే ప్రధాని దాదాపు అరగంట ప్రసగించారు. ఆయన ప్రసంగంలో ఇస్రోలో జరిగే ప్రయోగాలతో పాటు శాస్తవ్రేత్తల కృషి, శ్రమను కొనియాడి భవిష్యత్‌లో మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేపట్టడమే కాకుండా యువ శాస్తవ్రేత్తలను తీసుకురావాలన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్, షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఇతర శాస్తవ్రేత్తలను అభినందించారు. ప్రయోగానంతరం పిఎం, గవర్నర్, సిఎంలకు ఇస్రో చైర్మన్, షార్ డైరెక్టర్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లి వీడ్కోలు పలికారు.
ముక్కంటీశుని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
శ్రీకాళహస్తి: ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి పిఎస్‌ఎల్‌వి సి-23 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన తరువాత ఆయన కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు దేవస్థానం వేదపండితులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తరువాత వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ ఇన్స్‌పెక్టర్ సుదర్శన్ తీర్థప్రసాదాలను, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఉపగ్రహ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, ఆ తరువాత శ్రీకాళహస్తీశ్వరాలయానికి రావడం ఆనవాయితీగా ఉంది.

No comments:
Post a Comment